మంగళవారం 27 అక్టోబర్ 2020
Jagityal - Sep 24, 2020 , 01:38:28

అన్ని వర్గాల ప్రజలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

 అన్ని వర్గాల ప్రజలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

  •  n జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌
  •  n సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

జగిత్యాల రూరల్‌ : అన్ని వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జగిత్యాలఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం జగిత్యాల పట్టణానికి చెందిన 24మంది లబ్ధిదారులకు రూ.7,50,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత సహకారంతో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అధిక సంఖ్యలో సీఎం సహాయ నిధి చెక్కులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మోసిమ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణాధ్యక్షుడు కత్రోజ్‌ గిరి, ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు, శేఖర్‌, రాజ్‌కుమార్‌, మల్లేశం, కౌన్సిలర్‌ పంబాల రాము పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే పరామర్శ...

జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన కుడిజల కావ్య, జంగ ఆశవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌ బోనగిరి నారాయణ, ఉప సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ నక్కల రవీందర్‌రెడ్డి, నాయకులు మల్లేశం, శ్రీనివాస్‌, రాజరెడ్డి, స్వామిరెడ్డి తదితరులు ఉన్నారు. 

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు 

సారంగాపూర్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు పథకాలు ప్రవేశపెట్టారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బీర్‌పూర్‌ మండలంలోని చిత్రవేణి గూడెంనకు చెందిన గిరిజన యువకుడు కిరణ్‌కు  డ్రైవర్‌ కం ఓనర్‌ పథకంలో భాగంగా వచ్చిన కారును ఎమ్మెల్యే అందజేశారు. డ్రైవర్‌ కం ఓనర్‌ పథకం ద్వారా 60 శాతం సబ్సిడీ, బ్యాంక్‌ లింకేజీ రూ.50వేల డౌన్‌ పేమెంట్‌తో కారు తీసుకున్న కిరణ్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకాలు నిరుద్యోగ యువత స్వయం కృషితో ఎదగడానికి ఎంతో దోహదపడతాయన్నారు. గిరిజన, మైనార్టీ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొల్ముల రమణ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్ల మైహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నారపాక రమేశ్‌, నాయకులు శ్రీనివాస్‌రావు, ప్రభాకర్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.


logo