శనివారం 31 అక్టోబర్ 2020
Jagityal - Sep 22, 2020 , 02:15:34

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి

పెగడపల్లి: నంచర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రైస్‌ మిల్లు, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సంఘం చైర్మన్‌ మంత్రి వేణుగోపాల్‌, ఉపాధ్యక్షుడు నామ సురేందర్‌రావు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ధర చెల్లిస్తామన్నారు. మంత్రి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, స్థలం కేటాయింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉప సర్పంచ్‌ తిరుపతియాదవ్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, మ ల్లారెడ్డి, వెంకన్న, సురేందర్‌, తిరుపతిరెడ్డి ఉన్నారు.

జగిత్యాల: అధిష్టానంతో మాట్లాడి డాక్టర్‌ పిడమర్తి రవికి నామినేటెడ్‌ పదవి ఇప్పించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మాదిగ జేఏసీ నాయకులు సోమవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెడపట్ల దుబ్బయ్య తదితరులున్నారు.