శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 22, 2020 , 02:15:34

జిల్లాలో 137 కరోనా కేసులు

జిల్లాలో 137 కరోనా కేసులు

జగిత్యాల: జిల్లాలో సోమవారం 137కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు. జిల్లా దవాఖానలో 13, మెట్‌పల్లి ప్రభుత్వ దవాఖానలో 8, కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో 1, రాయికల్‌లో 11, ధర్మపురిలో 5, వెల్గటూర్‌లో 4, అంబారిపేటలో(న్యూ)లో 9, సారంగాపూర్‌లో 3, పెగడపల్లిలో 2, కల్లెడలో 4, మల్యాలలో 7, గొల్లపల్లిలో 2, జగిత్యాల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌(రాంవెల్‌)లో 7, ఖిలాగడ్డ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 1, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మోతెవాడలో 4, అయిలాపూర్‌లో 12, కోరుట్ల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ అల్లమయ్యగుట్టలో 5, కథలాపూర్‌లో 1, అంబారిపేట(ఓల్డ్‌)లో 2,  మేడిపల్లిలో 7, జగ్గాసాగర్‌లో 9, మెట్‌ప ల్లి యూపీహెచ్‌సీలో 7, ఇబ్రహీంపట్నంలో 2, మల్లాపూర్‌లో 11 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 1336 మంది శాంపి ళ్లు సేకరించగా 137పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. 

మల్లాపూర్‌: మల్లాపూర్‌ పీహెచ్‌సీలో 51మందికి పరీక్షలు నిర్వహించారు. మల్లాపూర్‌కు చెందిన ఒకరు, చిట్టాపూర్‌కు చెందిన ఒకరు, మెట్‌పల్లికి చెందిన తొమ్మిది మంది కరోనా బారిన పడినట్లు వైద్యాధికారి రాకేశ్‌కుమార్‌ తెలిపారు. 

పెగడపల్లి: పెగడపల్లి ప్రభుత్వ వైద్యశాలలో 51మందికి టెస్టులు నిర్వహించగా, పెగడపల్లికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి సుధాకర్‌ తెలిపారు.

మల్యాల: మల్యాల పీహెచ్‌సీలో 44 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారించినట్లు మండల వైద్యాధికారి లావణ్య తెలిపారు. రాంపూర్‌లో ఇద్దరు, కొండగట్టులో ఒకరు, మల్యాలలో ఇద్దరు, పోతారంలో ఒకరు, రామన్నపేటలో ఒకరు కరోనా బారిన పడినట్లు పేర్కొన్నారు.

మెట్‌పల్లి రూరల్‌: జగ్గసాగర్‌ పీహెచ్‌సీలో 50మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వై ద్యాధికారి నరేంద్ర తెలిపారు. మెట్లచిట్టాపూర్‌లో ఇద్దరు, చిం తలపేటలో ఇద్దరు, ఆత్మకూర్‌లో ముగ్గురు, వెల్లుల్లలో ఒక రు, మెట్‌పల్లిలో ఒకరు కరోనా బారిన పడినట్లు పేర్కొన్నారు.

కథలాపూర్‌: కథలాపూర్‌, అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 108 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.