శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 22, 2020 , 02:15:36

సిగ్నల్‌ వ్యవస్థతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ

సిగ్నల్‌ వ్యవస్థతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ

  •  రూ. 50 లక్షలతో ఏర్పాటుకు భూమి పూజ n ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల అర్బన్‌ : సిగ్నల్‌ వ్యవస్థతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సులభతరమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల పట్టణంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థకు ఎమ్మెల్యే, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి సోమవారం పాత బస్టాండ్‌ చౌరస్తా వద్ద భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్‌ మాట్లా డుతూ, రూ. 50 లక్షలతో జగిత్యాల కొత్తబస్టాండ్‌, మంచినీళ్ల బావి, పాత బస్టాండ్‌లతో పాటు మరో రెండు ప్రాం తాల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే పట్టణంలోని 14 ప్రాంతాల్లో లైట్‌ బ్లింకర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నిధులు విడుదల చేశారని తెలిపారు.  కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ సురేశ్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, డీఈ లచ్చిరెడ్డి, జగిత్యాల టౌన్‌ సీఐ జయేశ్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, హరీశ్‌ పాల్గొన్నారు.