శనివారం 31 అక్టోబర్ 2020
Jagityal - Sep 21, 2020 , 02:59:02

ఉచితంగా చేప పిల్లల పంపిణీతో లబ్ధి

ఉచితంగా చేప పిల్లల పంపిణీతో లబ్ధి

మల్యాల : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుండడంతో గంగపుత్ర, ముదిరాజ్‌, బెస్త కులస్తులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తాటిపెల్లి శివారులోని పెద్దచెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని వివరించారు. మత్స్య సంప ద గణనీయంగా పెరిగిందని తెలిపారు. ముదిరాజ్‌, గంగపుత్ర, బెస్త కులస్తులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ద్విచక్ర వాహనాలు, మార్కెటింగ్‌ కోసం సంచార ఆటోలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. చేపలు పట్టేందుకు వలలను సైతం సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామన్నారు. మ ల్యాల మండలంలోని 19 గ్రామపంచాయతీల పరిధిలోని 27 చెరువుల్లో బొచ్చె, రాహు, మరో రెండు రకాల వెరైటీలతో మొత్తం 13 లక్షల 69వేల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వాటిలో పెద్ద రకానికి చెందిన చేప పిల్లలు 1 లక్షా 82 వేల పిల్లలు, మరో 11 లక్షల 87 వేల చేపపిల్లలు చిన్నరకానివని వెల్లడించారు. ఆయా చేప పిల్లలకు ప్రభుత్వ పరంగా రూ.8,25,590 వెచ్చించి మత్స్య సహకార సంఘ సభ్యులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. తాటిపల్లి పెద్దచెరువులో 55వేల చేపపిల్లలను పంపిణీ చేశామన్నారు. అనంతరం ముత్యంపేట శివారులోని తుమ్మచెరువు మత్తడి వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టారు. కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్‌ అధికారి రాజనర్సయ్య, మల్యాల జడ్పీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, నూకపల్లి, పోతారం సహకార సంఘ అధ్యక్షులు మధుసూదన్‌రావు, సాగర్‌రావు, సర్పంచులు బింగి జ్యోత్స్న, బద్దం తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు దొంగ అనిత, నాయకులు ఎనుగందుల రజని, పొన్నం జమున, అయిల్నేని కోటేశ్వరరావు, సామల్ల దేవరాజం, త్రినాథ్‌, మారంపల్లి నారాయణ, రాజేందర్‌రెడ్డి, ఆగంతం వంశీధర్‌, సంత ప్రకాశ్‌రెడ్డి, బింగి వేణు, దొంగ ఆనందరెడ్డి, జున్ను సురేందర్‌, రమణ, శ్రీనివాస్‌గౌడ్‌, పిషరీస్‌ ఫీల్డ్‌ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.