శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 21, 2020 , 02:44:31

దివ్యాంగులకు ప్రభుత్వం అండ

దివ్యాంగులకు ప్రభుత్వం అండ

జగిత్యాల రూరల్‌ : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని దివ్యాంగులకు ఏడీఐపీ పథకం కింద బ్యాటరీతో నడిచే 50 ట్రై మోటర్‌ సైకిళ్లను జగిత్యాలలోని ఎల్జీ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృషి ఫలితంగానే లబ్ధిదారులందరికీ బ్యాటరీ సైకిళ్లను అందజేశామని వివరించారు. దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3016 చొప్పున పింఛన్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. దివ్యాంగులను సకలాంగులు పెండ్లి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం రూ. లక్షకు అదనంగా మరో రూ.లక్ష సాయం అందజేస్తున్నదని తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావ డం లేదన్నారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా బ్యాటరీ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, వైస్‌చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, సారంగాపూర్‌ ఎంపీపీ కోల జమున పాల్గొన్నారు. 

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయం

కొడిమ్యాల: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయం సాధిస్తారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ఏడీఐపీ పథకం కింద బ్యాటరీతో నడిచే ట్రై మోటర్‌ సైకిళ్లను కొడిమ్యాల మండలంలోని ఏడుగురు, మల్యాల మండలంలోని 8 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ట్రై మోటర్‌ సైకిళ్లను ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. దమ్మయ్యపేట గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.20 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమాధికారి నరేశ్‌, మల్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, ఎంపీపీ మేనేని స్వర్ణలత, మల్యాల జడ్పీటీసీ సభ్యుడు కొండపల్కుల రామ్మోహన్‌రావు, వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మేనేని రాజనర్సింగారావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు మండలాల అధ్యక్షులు అనుమండ్ల రాఘవరెడ్డి, బోయిన్‌పల్లి మధుసూదన్‌రావు, ఎంపీటీసీ సభ్యులు చీకట్ల సింధు, మహేశ్‌, సర్పంచులు పిల్లి మల్లేశం  పాల్గొన్నారు.