శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 20, 2020 , 03:00:33

అక్రమ కార్యకలాపాలపై దాడులు

అక్రమ కార్యకలాపాలపై దాడులు

జగిత్యాల క్రైం : జిల్లా వ్యాప్తంగా శనివారం అక్రమ కార్యకలాపాలపై మెరుపు దాడులు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ కమలాసన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ. 3,05,815 విలువైన గుట్కాను పట్టుకున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని టవర్‌ సర్కిల్‌ వద్ద మహమ్మద్‌ రహమాన్‌కు చెందిన ఎంబీఆర్‌ స్టోర్‌పై జగిత్యాల టౌన్‌ సీఐ జయేశ్‌రెడ్డి దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2,45,815 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారన్నారు. మెట్‌పెల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ. 50వేల గుట్కా, మల్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొండగట్టు వద్ద సీసీఎస్‌ పోలీసులు రూ. 10వేల విలువైన గుట్కా, లంబాడిపెల్లిలో 8 క్వింటాల్ల పీడీఎస్‌ రైస్‌ను పట్టుకున్నారన్నారు. కోరుట్లలోని సోమేశ్వర రైస్‌ డిపోలో నిల్వ ఉంచిన 12 క్వింటాల్ల పీడీఎస్‌ రైస్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కోరుట్ల మండలం నాగులపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లపై దాడులు చేసిన 50 ట్రాక్టర్ల ఇసుక, రాయికల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నామన్నారు. మల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి సిర్పూర్‌లో పేకాట స్థావరంపై దాడి చేసి రూ. 17,990, ఐదు బైక్‌లు, 8 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.