శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 20, 2020 , 03:00:33

కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా

కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా

  •  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కొత్తపల్లి: ఎన్పీడీసీఎల్‌ పరిధిలో అన్‌మ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆర్టిజన్‌ గ్రేడ్‌-2గా గుర్తించి, మెరుగైన జీతం, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్మికులు శనివారం హైదరాబాద్‌లో వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ లేని గ్రామాల్లో తాము విధులు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. పదవీ విరమణ చేసిన వారితో పనులు చేయించుకుంటూ తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వాపోయారు. ఎన్పీడీసీఎల్‌లో మాత్రం అన్‌మ్యాన్‌ కాంట్రాక్టు కార్మికులను అర్టిజన్‌ గ్రేడ్‌-2 గా గుర్తించారని వారు వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వినోద్‌ కుమా వారికి హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన ఈ విషయమై ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావుతో ఫోన్‌లో చర్చించారు. ఇందులో అన్‌మ్యాన్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రచారి, కార్మికులు ఉన్నారు.