ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 17, 2020 , 02:52:35

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి అలవెన్స్‌లు ఇవ్వాలి

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి అలవెన్స్‌లు ఇవ్వాలి

  • అసెంబ్లీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల రూరల్‌: కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు అలవెన్సులు అందజేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌  సంజయ్‌కుమార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో మహిళా, శిశు సంక్షేమంపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మానవత్వానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో ఔట్‌సోర్సింగ్‌ వైద్య, పారిశుధ్య సిబ్బంది సేవలందిస్తున్నారని, వారికి సైతం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అందించిన విధంగానే అలవెన్స్‌లు ఇవ్వాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని చెప్పారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని దవాఖానలో బెడ్లు పూర్తిగా నిండిపోయాయని, ఇక్కడి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నూతన భవనంలోకి తరలిస్తే బెడ్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదన్నారు.   logo