మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 16, 2020 , 03:09:58

జమ్మికుంటలోనే కొవిడ్‌ చికిత్స

జమ్మికుంటలోనే కొవిడ్‌ చికిత్స

  • n ప్రభుత్వ దవాఖానలో    60 బెడ్ల ఏర్పాటుకు చర్యలు
  • n  కలెక్టర్‌ కే శశాంక 
  • n చికిత్స, ఐసొలేషన్‌ కేంద్రాల ప్రారంభం

జమ్మికుంట: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(ప్రభుత్వ దవాఖాన)లో కొవిడ్‌ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ శశాంక తెలిపారు.  వ్యాధి తీవ్రత లేని వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్‌లో ఐసొలేషన్‌ కేంద్రంలో ఉండాలని  సూచించారు. మంగళవారం కలెక్టర్‌ జమ్మికుంటకు వచ్చారు. ప్రభుత్వ దవాఖాన, బాలికల హాస్టల్‌ను  సంద ర్శించారు. సీహెచ్‌సీలో చికిత్స, హాస్టల్‌లో ఐసొలేషన్‌ కేంద్రాలను ప్రారంభించారు.   అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వార్డులన్నీ కలియతిరిగారు. దవాఖాన, వసతి గృహం ప్లాన్‌లను, గదులను పరిశీలించారు.   రోగులు ఇబ్బందులు పడ కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.   వైద్యు లు, సిబ్బందికి ప్రత్యేక గదులు, సదుపాయాలపై ఆరా తీశారు. నియమితులైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు  పర్యవేక్షించాలని అధికారులను ఆదే శించారు.  తర్వాత ఆయ న మాట్లాడుతూ.. సీహెచ్‌సీలో కొవిడ్‌ వార్డులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.  రానున్న రోజుల్లో 60 బెడ్స్‌ ఏర్పాటు చేసేలా అధికారులకు సూచనలిచ్చామని చెప్పారు. కలిసికట్టుగా కొవిడ్‌ను ఎదుర్కొందామని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు.  తర్వాత కలెక్టర్‌ ఆబాది జమ్మికుంటలోని రైతు వేదిక ని ర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలసత్వం వహించవద్దని చెప్పారు. ఆర్డీవో బెన్‌షాలోం, డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా, బల్దియా చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ డాక్టర్‌ శ్యాం, కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌, తహసీల్దార్‌  నారాయణ, సీఐ సృజన్‌రెడ్డి, నోడల్‌ అధికారి సుధాకర్‌రెడ్డి, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ అనితారెడ్డి, వైద్యులు, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.


logo