శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 16, 2020 , 03:10:00

‘వేదిక’ల పనుల్లో వేగం పెంచాలి

‘వేదిక’ల పనుల్లో వేగం పెంచాలి

  • n వచ్చే నెల 6వ తేదీలోగా పూర్తి చేయాలి
  • n కలెక్టర్‌ కే శశాంక
  • n చిగురుమామిడిలో పనుల పరిశీలన

చిగురుమామిడి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శశాంక అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అక్టోబర్‌ 6వ తేదీలోగా పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. మంగళవారం మండలకేంద్రంలో పర్యటించారు. తహసీల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. భూ రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ పనులను పూర్తి చేయా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బ్లాక్‌ ప్లాంటేషన్‌ను సందర్శించి మొక్క నాటారు. తదనంతరం సమీపంలో కొనసాగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వేదికల్లో సకల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.     ప్రతి ఒక్కరూ హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  వైస్‌ ఎం పీపీ రాజిరెడ్డి, పీఆర్‌ఎస్‌ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, తహసీల్దార్‌ ముబిన్‌ అహ్మద్‌, ఎంపీడీవో ఖాజామొయినొద్దీన్‌, డీఈ జనార్దన్‌, ఏఈ రవి ప్ర సాద్‌, సర్పంచులు లక్ష్మణ్‌, వెంకటేశం ఉన్నారు.


logo