సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 15, 2020 , 02:59:33

పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

  • జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ అధికారి ప్రసాద్‌ 

 కోరుట్ల రూరల్‌ :  అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ అధికారి ప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం నాగులపేట గ్రామంలో నర్సరీ, రేషన్‌ షాప్‌, డంప్‌ యార్డు, మురుగు కాలువలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీలో రికార్డులను తనిఖీ చేశారు. సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వసంత, సహకార సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

సంక్షేమ పథకాలు సద్వినియోగం కావాలి

కథలాపూర్‌: సంక్షేమ పథకాలు సద్వినియోగం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని క్వాలిటీ కంట్రోల్‌ అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం భూషణరావుపేట, కథలాపూర్‌ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, రేషన్‌ దుకాణాలు, వైకుంఠధామం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రవీణ్‌, ఏపీవో సతీశ్‌, టీఏ శ్రీధర్‌, సర్పంచులు నీరజ,  సులోచన, కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. logo