బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 15, 2020 , 02:59:33

పరిశోధనాత్మక విద్య కోసమే ప్రైవేట్‌ యూనివర్సిటీలు

పరిశోధనాత్మక విద్య కోసమే ప్రైవేట్‌ యూనివర్సిటీలు

  • అసెంబ్లీలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల : పరిశోధనాత్మకమైన విద్యనందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో యూనివర్సిటీలకు అనుమతినిచ్చిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడారు. యూనివర్సిటీల్లో నెలకొన్న సిబ్బంది సమస్య ఇప్పటిది కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ప్రైవేటు యూనివర్సిటీలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా వందలాది గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలను ప్రజలు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. logo