బుధవారం 21 అక్టోబర్ 2020
Jagityal - Sep 14, 2020 , 03:13:06

ప్రపంచ దేశాల చూపు తెలంగాణ వైపు

ప్రపంచ దేశాల చూపు తెలంగాణ వైపు

ధర్మపురి/ధర్మపురి రూరల్‌: సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శం గా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ధర్మపురి మండలం గాదెపల్లి, తీగల ధర్మారం గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడా రు. ఆరేళ్ల పాలనలో తెలంగాణ అనేక ప్రయోగాలకు వేదికైందన్నారు. రైతులకు కొండంత అండ గా నిలిచేలా చరిత్రాత్మక రెవెన్యూ చట్టం బిల్లును సీఎం కేసీఆర్‌  తీసుకువచ్చి దేశం అబ్బురపడేలా చేశారన్నారు. భూరికార్డుల కోసం రైతులు రెవె న్యూ అధికారుల చుట్టూ తిరిగే పని ఇక ఉండదన్నారు. గత ప్రభుత్వాలు వక్ఫ్‌ భూములను పట్టించుకోలేదని, వీటితోపాటు దేవాలయ భూ  ముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీ సుకుంటున్నదన్నారు. ప్రస్తుతం వాటి రిజిస్ట్రేషన్లను ప్ర భుత్వం నిలిపివేసిందని చెప్పారు. పేదప్రజల సం క్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. 

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

మండలంలోని గాదెపల్లిలో పల్లెప్రకృతి వనా న్ని మంత్రి ఈశ్వర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో ప్రకృతి వనాల ఏర్పాటుతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. అంతకుముందు గ్రామంలో రూ.25లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం తీగలధర్మారం గ్రామంలో రూ.16లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో రూ.30లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ధర్మపురి మండల పరిషత్‌ కార్యాలయంలో ధర్మపురి, బుగ్గారం మండలాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ.19,37,200 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. అలాగే 41 మంది లబ్ధిదారులకు రూ.41,04,756 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మి, ఆండాలు, నాయకులు సంగి శేఖర్‌, అక్కనపల్లి సునీల్‌కుమార్‌, సాంబు, కార్తిక్‌, చీర్నేని నర్సయ్య, భారతపు గుండయ్య, సుధాకర్‌రావు, బాలరాజు తదితరులున్నారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

ధర్మపురి మండలం గాదెపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి ఈశ్వర్‌ పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొత్త రెవెన్యూ చట్టంతో దశాబ్దాలుగా నెలకొన్న రైతుల సమస్యలు పరిష్కరించబడుతాయని చెప్పారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మొక్క నాటారు. 


logo