మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 14, 2020 , 03:11:56

చేపల పెంపకంతో నిరంతర ఆదాయం

చేపల పెంపకంతో నిరంతర ఆదాయం

రాయికల్‌ రూరల్‌ : గంగపుత్రులకు నిరంతర ఆదాయాన్ని సమకూర్చాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు. రాయికల్‌ పట్టణంలోని పెద్ద చెరువులో ఆదివారం చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపడం ద్వారా మత్స్యకారులకు నిరంతరం పని ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్సీటీసీ అశ్విని, మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్‌ పర్సన్‌ గండ్ర రమాదేవి, ఏఎంసీ చైర్మన్‌ గన్నె రాజారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొల్లూరి వేణు, సహకార సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్‌ రెడ్డి, మహేందర్‌నాయక్‌, నాయకులు అనిల్‌, రాజేశ్‌, సురేందర్‌నాయక్‌, మోబిన్‌ తదితరులు పాల్గొన్నారు.  

హరితహారంతో స్వచ్ఛ వాతావరణం

జగిత్యాల : హరితహారంతో రాష్ట్రంలో స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడిందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం 47 వార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోవిడుత హరితహారం లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం పూర్తి చేస్తున్నదన్నారు. అనంతరం డీఎంఎఫ్‌టీ నిధులు రూ.13.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు శ్రావణి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ చాంద్‌పాషా, జిల్లా యూత్‌ అధ్యక్షుడు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. logo