శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 10, 2020 , 03:39:39

రెవెన్యూ చట్టంతో అవినీతికి అడ్డుకట్ట

రెవెన్యూ చట్టంతో అవినీతికి అడ్డుకట్ట

  • n రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం
  • nకొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత

కొత్తపల్లి: కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌ పేర్కొన్నారు. కొత్త  రెవెన్యూ వ్యవస్థ బిల్లును బుధవారం అసెంబ్లీ సమావేశంలో  ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ చింతకుంట బస్టాప్‌ వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంతో భూసమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు, రైతుల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌ పాషా, ఎంపీటీసీలు తిరుపతినాయక్‌, కమల మనోహర్‌, పట్టెం శారద, లక్ష్మీనారాయణ, పండుగ గంగవ్వనర్సయ్య, మంద రమేశ్‌ గౌడ్‌, సర్పంచ్‌ మొగిలి మంజులసమ్మయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కాసారం శ్రీనివాస్‌గౌడ్‌, మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, బీసీ సెల్‌ మండలాధ్యక్షుడు సురేందర్‌, మైనార్టీ అధ్యక్షుడు చాంద్‌ బాషా, మండల ప్రధాన కార్యదర్శి రాజు, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ శంకర్‌గౌడ్‌, కార్మిక విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఉప్పు రాజశేఖర్‌, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే, కొత్తపల్లి బస్టాండ్‌ కూడలి వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు ఆధ్వర్యంలో పటాకలు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, కొత్త రెవెన్యూ చట్టంతో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన భూసమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ భూసమస్యలు లేని రాష్ట్రంగా మారుతుందన్నారు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఫక్రొద్దీన్‌, కౌన్సిలర్లు జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్‌, చింతల సత్యనారాయణరెడ్డి, గండు రాంబాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎస్‌కే బాబా, జెర్రిపోతుల శ్రీకాంత్‌, వేముల చంద్రశేఖర్‌, స్వర్గం నర్సయ్య, కట్ల సుధాకర్‌, చెట్టిపెల్లి ప్రభాకర్‌, దూస మునీందర్‌, మంచికట్ల కోటేశ్వర్‌, ప్రతాప్‌రెడ్డి, జనార్దన్‌, జమీల్‌, ఆర్బీఎస్‌ సభ్యులు పాల్గొన్నారు. 


logo