గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Sep 09, 2020 , 02:24:22

లక్ష్యం మేరకు రుణాలు అందించాలి

లక్ష్యం మేరకు రుణాలు అందించాలి

  • సెర్ప్‌ జగిత్యాల డీపీఎం వనజ

పెగడపల్లి : ప్రభుత్వ లక్ష్యం మేరకు మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ వనజ పేర్కొన్నారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రంలోని సెర్ప్‌ కార్యాలయంలో ఏపీఎం సమత, సీసీలు స్వామి, కృష్ణమోహన్‌, తిరుపతి, రవికుమార్‌లతో బ్యాంకు రుణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెగడపల్లి మండలంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు రూ.18 కోట్లు అందించాలని లక్ష్యం నిర్దేశిందని తెలిపారు. ఇప్పటి వరకు ఇక్కడ రూ. 6.55 కోట్ల రుణాలు అందించారని, 2021 మార్చి గడువు లోగా రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మహిళలు తీసుకున్న రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫాంను డీపీఎం పరిశీలించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పౌల్ట్రీఫాం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపారాలు సక్రమంగా నిర్వహించి లాభాలు ఆర్జించాలని స భ్యులకు సూచించారు. కార్యక్రమంలో  మండల సమా ఖ్య అధ్యక్షురాలు రూపకళ, సిబ్బంది రాము పాల్గొన్నారు.

తాజావార్తలు


logo