మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 09, 2020 , 02:24:50

సీఎంకు రుణపడి ఉంటాం

సీఎంకు రుణపడి ఉంటాం

  • lఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ lతూముల పనులు ప్రారంభించాలని ఆదేశించడంపై హర్షం  
  • lఫైల్‌పై సంతకం చేయడంపై కృతజ్ఞతలు

చొప్పదండి: మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న నాలుగు తూములు, నాలుగు ఉప కాలువల పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తూ ఫైల్‌పై సంతకం చేసిన ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భం గా మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను ఎమ్మెల్యే కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మోతె రిజర్వాయర్‌కు బదులుగా తూములు, ఉప కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగానే రూ.248.41కోట్ల నిధు లు మంజూరయ్యాయని తెలిపారు. పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని, ఈ పనులు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారని, తొందరలోనే పనులు ప్రారం భం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. షానగ ర్‌, సర్వరెడ్డిపల్లి, చిప్పకుర్తి, వెదిర గ్రామాల వద్ద తూముల నిర్మాణం చేపడుతామన్నారు. ఈ తూ ముల నిర్మాణంతో నియోజకవర్గంలోని 30వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. తూముల నిర్మా ణ పనుల ప్రారంభానికి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌, మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.  


logo