గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Sep 05, 2020 , 01:54:08

వ్యవసాయ యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపకుడిగా రాంరెడ్డి

వ్యవసాయ యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపకుడిగా రాంరెడ్డి

జగిత్యాల : వ్యవసాయ కళాశాల, పొలాసలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ వీ రాంరెడ్డికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకుడి అవార్డును అందుకున్నారు.  జాతీయ స్థాయిలో ఎంతోమంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.  రైతులకు విత్తనోత్పత్తి, వ్యవసాయ పరిజ్ఞానంపై అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. రాంరెడ్డి ఉత్తమ అధ్యాపకుడి అవార్డు అందుకున్న సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ సీ నరేందర్‌రెడ్డి, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. logo