ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 04, 2020 , 02:08:21

ప్రవీణ్‌యాదవ్‌ మృతిపై రాజకీయం చేయొద్దు

ప్రవీణ్‌యాదవ్‌ మృతిపై రాజకీయం చేయొద్దు

  •  n మంత్రి ఈటలపై అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించం
  •  n ఎంపీపీ  సరిగొమ్ముల పావని 

ఇల్లందకుంట: టీఆర్‌ఎస్వీ నాయకుడు ప్రవీణ్‌యాదవ్‌ మృతిపై కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేయొద్దని ఎంపీపీ సరిగొమ్ముల పావని సూచించారు. మండల కేంద్రంలో  గురువారం ఆమె టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిపోయిందన్నారు. ప్రవీణ్‌యాదవ్‌ తమ విద్యార్థి సంఘం నాయకుడని, ఆయన కుటుంబాన్ని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తమ పార్టీ కార్యకర్తలు మరణిస్తే వారి   కుటుంబాలను కనీసం పరామర్శించలేదని, ఇప్పుడు ప్రవీణ్‌యాదవ్‌ మృతిపై  మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి కారు డ్రైవర్‌ అనారోగ్యంతో బాధపడితే ప్రాణభిక్ష పెట్టింది మంత్రి ఈటల రాజేందర్‌ అని స్పష్టం చేశారు.  మంత్రిని విమర్శించే అర్హత కాంగ్రెస్‌ నాయకులకు లేదని, వారి స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దవాఖానల సందర్శన పేరిట కాంగ్రెస్‌ నాయకులు మంత్రి ఈటలను విమర్శించడం సరికాదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌, సర్పంచులు రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, సాంబయ్య, రఫీఖాన్‌, రజిత, ఎంపీటీసీలు ఐలయ్య, నర్సమ్మ, ఓదెలు, సింగిల్‌విండో అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కందాల కొంరెల్లి, రఫీ, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు జవ్వాజి కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్‌, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్‌, రాజు, మధుసూదన్‌రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo