గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Sep 02, 2020 , 02:48:26

రహదారి విస్తరణ కోసం సర్వే

రహదారి విస్తరణ కోసం సర్వే

శంకరపట్నం : మండలంలోని కేశవపట్నంలో అధికారులు మంగళవారం జాతీయ రహదారి 563  భూ సేకరణ సర్వే నిర్వహించారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కేశవపట్నం - తాడికల్‌ బైపాస్‌ రోడ్డుకు సర్వే చేశారు. సుమారు 6 కిమీ మేర నిర్మించనున్న బైపాస్‌ రోడ్డుకు కొలతలు వేసి హద్దులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గతంలో 60మీటర్ల వెడల్పుతో భూసేకరణకు ప్రయత్నించిన అధికారులు స్థానిక రైతులు అడ్డు చెప్పడంతో దానిని 45 మీటర్లకు కుదించారు. మళ్లీ మంగళవారం నిర్వహించిన సర్వేలో 60 మీటర్లకు హద్దులు ఏర్పాటు చేసినట్లు రైతులు ఆరోపించారు.  తాము విలువైన భూమి కోల్పోవలసి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు తాము అడ్డుచెప్పడం లేదని తమకు న్యాయం చేయాలని కోరారు. 


logo