శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 02, 2020 , 02:48:27

1402 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు

1402 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు

హుజూరాబాద్‌టౌన్‌ : హుజూరాబాద్‌ అర్బన్‌, చెల్పూర్‌ పీహెచ్‌సీల పరిధిలో మంగళవారం ప్రత్యేక వైద్య బృందాల సభ్యులు 1402 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారని హుజూరాబాద్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా తెలిపారు. హుజూరాబాద్‌ అర్బన్‌ పరిధిలో రజకవాడ, మార్కెట్‌ ఏరియా, ఒడ్డెరవాడ, వివేకానందనగర్‌, బూసారపువాడలో ఐదు వైద్య బృందాల సభ్యులు 104 ఇండ్లల్లో 409 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారన్నారు. చెల్పూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని  కందుగుల, శాలపల్లి, ధర్మరాజుపల్లి, చెల్పూర్‌, పోతిరెడ్డిపేట, పెద్దపాపయ్యపల్లి, సింగాపూర్‌, సిర్సపల్లి, జూపాకలో తొమ్మిది వైద్య బృందాల సభ్యులు 993 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. నలుగురికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారి రక్త నమూనాలు సేకరించి హుజూరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించామన్నారు. కార్యక్రమాల్లో హుజూరాబాద్‌, చెల్పూర్‌ పీహెచ్‌సీల వైద్యులు, ఆర్‌బీఎస్‌కే వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo