శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 02, 2020 , 02:48:29

ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానుకోవాలి

ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానుకోవాలి

  • n జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాం
  • n ఓర్వలేకనే విమర్శిస్తున్న ప్రతిపక్షాలు
  • n జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల రూరల్‌: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుండగా, ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని సహకార సంఘాల్లో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురియడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో కొందరు యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ రైతులకు సరిపడా యూరియా తెప్పించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాశాఖ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. రైతులతో ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో లేవని, రావని రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, నాయకులు జోగినపల్లి సందీప్‌రావు, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రణబ్‌ ముఖర్జీ మృతి తీరనిలోటు 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి తెలంగాణ రాష్ర్టానికి తీరని లోటని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధో సంపత్తి కలిగిన మహోన్నతుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ వారంపాటు సంతాప దినాలు ప్రకటించినందుకు ఆయన సేవలను గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు.  logo