బుధవారం 30 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 01, 2020 , 02:25:24

సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేదలకు వరం

  • n ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌
  • n పెంబట్లలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
  • n కోనాపూర్‌లో రైతువేదిక నిర్మాణ పనుల పరిశీలన

సారంగాపూర్‌: సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆ యా గ్రామాలకు చెందిన 12మందికి రూ.3.72 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని కోనాపూర్‌లో చేపట్టిన రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 13 చోట్ల రైతు వేదిక నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. స్థలం సమస్య కారణంగా మైతాపూర్‌లో నిర్మాణం జాప్యమవుతుందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. అనంతరం పోచంపేట సర్పంచ్‌ పల్లికొండ రమేశ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతడిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సొల్లు సురేందర్‌, కోఆప్షన్‌ సభ్యుడు అమీర్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కోల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌  అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు మల్లారెడ్డి, సంతోష్‌, వెంకటేశ్‌, లావణ్య రాథోడ్‌, వెంకటరమణారావు, శ్రీలత, జయ, జమున, రాజేశం, శేఖర్‌గౌడ్‌, రాజు, ఆనంద్‌, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, కిషన్‌, అజ్మీరా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo