మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 01, 2020 , 02:25:27

ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం

ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం

  • n  సాగు, తాగునీటి సమస్యకు   శాశ్వత పరిష్కారం చూపడం హర్షణీయం
  • n  ఎంపీపీ చిలుక రవీందర్‌, జిల్లా కోఆప్షన్‌   సభ్యుడు షుక్రొద్దీన్‌

చొప్పదండి: రామడుగు మండలంలో మోతె రిజర్వాయర్‌కు బదులుగా మోతె వాగు నిర్మాణంలో భాగంగా వరద కాలువకు నాలుగు తూముల ఏర్పాటు కోసం రూ.248 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు రుణపడి ఉంటామని ఎంపీపీ చిలుక రవీందర్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు షుక్రొద్దీన్‌ పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ తూముల నిర్మాణంతో చొప్పదండి, రామడుగు మండలాల్లో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ముఖ్యంగా చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, మల్లన్నపల్లి, కోనేరుపల్లి, మంగళపల్లి గ్రామాల్లో ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం హర్షణీయమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మోతెవాగు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు మేడిపల్లి సత్యం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు షుక్రొద్దీన్‌, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల కోఆప్షన్‌ సభ్యులు పాషా, రజబ్‌ అలీ, ఇస్మాయిల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, నాయకులు మహేశుని మల్లేశం, పబ్బ సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

చొప్పదండి: మోతెవాగు ప్రాజెక్ట్‌లో భాగంగా నాలుగు తూముల నిర్మాణానికి రూ.248కోట్ల నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గుమ్లాపూర్‌లో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బీసవేని రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ, 20 ఏండ్లకు పైగా గుమ్లాపూర్‌, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, మల్లన్నపల్లి, మంగళపల్లి గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో గ్రామాధ్యక్షుడు వెల్మ రఘుపతిరెడ్డి, వార్డు సభ్యులు మండల అనిల్‌, బొడిగె రాజశేఖర్‌, దాసరి రాజయ్య, కోలపూరి హన్మంతు, పెరుమండ్ల రాములు, రైతులు శ్యాంసుందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, ఆకుల సతీశ్‌, ముద్దం కుమార్‌, మల్లేశం, మల్లయ్య, కనకం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo