శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 01, 2020 , 02:25:27

నిరాడంబరంగా నిమజ్జన వేడుకలు

నిరాడంబరంగా నిమజ్జన వేడుకలు

చొప్పదండి: మండలంలో గణపతి నిమజ్జన వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో మండలంలో బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఆలయాల్లో, ఇండ్ల ఆవరణలో వినాయక విగ్రహాలను 2ఫీట్లలోపు  విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు. సోమవారం ఎలాంటి ఆడంబరాలు, ఊరేగింపు లేకుండా తీసుకెళ్లి ఆయా గ్రామాల్లోని చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు.

గంగాధర: మండలంలో సోమవారం వినాయక నిమజ్జనాన్ని ఆడంబరాలు లేకుండా నిర్వహించారు. ఊరేగింపులు, డీజేలు లేకుండా వాహనానికి ఇద్దరు ముగ్గురు చొప్పున వినాయక విగ్రహాలను స్థానిక చెరువులు, కుంటలు, వరదకాలువ వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్‌ఐ తాండ్ర వివేక్‌ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

రామడుగు: గణనాథుడి నిమజ్జన వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. గోపాల్‌రావుపేట అల్ఫోర్స్‌ హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి విగ్రహాన్ని స్థానిక ఎస్సారెస్పీ కాలువలో నిమజ్జనం చేశారు. 


logo