ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 31, 2020 , 00:17:38

వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

జగిత్యాల: గణేశ్‌ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ సూచించారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట చెరువు వద్ద ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. చింతకుంట చెరువు వద్ద నిమజ్జనం సందర్భంగా లైట్లు, పడవలు, గజ ఈతగాళ్లను పెట్టామన్నారు. కరోనా నేపథ్యంలో విగ్రహా లు తక్కువ సంఖ్యలో ప్రతిష్ఠించారన్నారు. నిమజ్జన ఏర్పాట్లలో ఎక్కడా తక్కువ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఎక్కువ ఎత్తు విగ్రహాలు, మండపాలు వేయకుండా కొవిడ్‌-19 నిబంధనలు పా టించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ కప్పల శ్రీ కాంత్‌, నాయకులు ఆనందరావు, బోగ ప్రవీణ్‌, బాలె శంకర్‌, పోచాలు, లింగయ్య, శంకర్‌, రమేశ్‌, క్రాంతి తదితరులున్నారు. 

ఎమ్మెల్యేను కలిసిన లీగల్‌ అడ్వయిజర్‌

జగిత్యాల మున్సిపల్‌ లీగల్‌ అడ్వయిజర్‌గా నియమితులైన నకుమల్ల లక్ష్మీనారాయణ ఆదివారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయన వెంట నాయకులు ప్రవీణ్‌, వెంకటనర్సయ్య, రాజు ఉన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ 

జగిత్యాల రూరల్‌:  మండలంలోని పోరండ్ల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గడ్డవేని పద్మ, ఆరె రాజన్న, గడ్డవేని సత్తన్న కుటుంబ సభ్యులతో పాటు ప్రమాదవశాత్తు పొలంవద్ద చని పోయిన పడిగెల రాజిరెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కన్నాపూర్‌ సర్పంచ్‌ సుధాకర్‌, పడిగెల గంగారెడ్డి, నాగిరెడ్డి, తిరుపతి, ఆరె రవి, హరీశ్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo