శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 28, 2020 , 02:34:42

రైతు వేదిక పనులు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదిక పనులు త్వరగా పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ గుగులోత్‌ రవి

గొల్లపల్లి: రైతు వేదిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి పేర్కొన్నారు. మండలంలోని చెందోలి గ్రామంలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 15లోగా పనులు పూర్తి చేయాలని కోరారు. నిర్మాణ పనులు రెండో దశలో ఉన్నప్పటికీ అనుకున్నంత పురోగతి లేదన్నారు. ఆయన వెంట ఆర్డీవో మాధురి, ఈఈ మనోహర్‌రెడ్డి, తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌, ఎంపీడీవో రవీందర్‌రావు, డీఈ రహెమాన్‌, సర్పంచ్‌ అలిశెల్లి రవీందర్‌, ఎంపీటీసీ అశోక్‌ పాల్గొన్నారు. 


logo