శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 28, 2020 , 02:35:01

కార్టూన్‌ కింగ్‌

కార్టూన్‌ కింగ్‌

  • l హాస్య, వ్యంగ్య చిత్రాలతో జాగృతం
  • lఅవార్డులు, పురస్కారాలు, బహుమతులు సొంతం
  • l సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులకు పాఠాలు
  • l ఆదర్శంగా నిలుస్తున్న నాగరాజు 

బహుమతులు- పురస్కారాలు... రెండు సార్లు జాతీయ స్థాయిలో బహుమతి, ఆరు సార్లు హాస్యానందం మాసపత్రికవారు నిర్వహించే తలిశెట్టి రామారావు స్మారక కార్టూన్‌ పోటీలో విశిష్ట బహుమతి, గో తెలుగు ఆన్‌లైన్‌ పత్రిక వారు, మల్లె తీగ మాసపత్రిక వారు, వివిధ సంస్థలు నిర్వహించిన కార్టూన్‌ పోటీల్లో, కెనడా తెలుగుతల్లి పత్రిక వారి కవితల పోటీల్లో బహుమతులు పొందాడు. దివంగత మహిళ కార్టూనిస్ట్‌ శ్రీమతి వాగ్దేవి పురస్కారం అందుకున్నాడు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆయన కార్టూన్లు ఉత్తమ కార్టూన్లుగా ప్రశంసలందుకున్నాయి. 2012 నుంచి 2018 వరకు తలిశెట్టి రామారావు విశిష్ట బహుమతి, 2017లో గో తెలుగు ఉగాది పురస్కారం, జాతీయ స్థాయిలో కార్టూన్‌ వాచ్‌ ఏకైక జాతీయ కార్టూన్‌ మాస పత్రిక వారి జాతీయ స్థాయి కర్తుం పోటీల్లో బహుమతి, 2019 సంవత్సరంలో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ కార్టూనిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ లో గురువారెడ్డి ప్రత్యేక ప్రశంసా పత్రం పొందాడు. 

సమకాలీన అంశాలపై తనదైన పంథాలో కార్టూన్లతో సమాజాన్ని జాగృతం చేస్తున్నాడు కార్టూనిస్టు నాగరాజు. పలు అంశాలపై వ్యంగ్యంగా, హాస్యాన్ని రంగరిస్తూ, ఎన్నో భావాలను చిత్రాల ద్వారా తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. ఎన్నో జాతీయ పురస్కారాలు, అందుకొని పలువురి మన్ననలు పొందుతున్నాడు. తన కళను పది మందికి నేర్పించాలనే తపనతో యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాల వేదికగా పాఠాలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

-మారుతీనగర్‌

మారుతీనగర్‌ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన వాసం నాగరాజు డిగ్రీ పూర్తి చేసి, వృత్తి రీత్యా రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. కార్టూన్‌ గురువు శ్రీ జయదేవ్‌ బాబు సహకారంతో కార్టూనిస్టుగా పలు పత్రికల్లో పనిచేసి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి పలు అవార్డులు పొందాడు. తన కళను పది మందికి పంచాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కార్టూన్‌ పాఠాలు బోధిస్తున్నాడు.


logo