శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 27, 2020 , 02:38:51

శాటిలైట్‌ సర్వే షురూ..

శాటిలైట్‌ సర్వే షురూ..

  • lఫలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
  • lబసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై  కదిలిన ఏవియేషన్‌ విభాగం
  • lరెవెన్యూశాఖ సహకారంతో 15రోజులపాటు.. చుట్టూ 20 కిలోమీటర్ల పరిశీలన

పాలకుర్తి: ఎట్టకేలకు కేంద్ర ఏవియేషన్‌ విభాగం కదిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై బుధవారం శాటిలైట్‌ సర్వేను ప్రారంభించింది. ఏవియేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు నాసిక్‌కు చెందిన ప్రైవేట్‌ సర్వే బృందం సభ్యులు బసంత్‌నగర్‌లోని విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, స్థలం గుర్తించి, మ్యాపింగ్‌చేసి ఏవియేషన్‌ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు ఆగస్టు 10న ఏవియేషన్‌ కన్సల్టెంట్‌ శ్రీనివాసమూర్తి ఈ ప్రదేశాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. విండ్‌ మెజర్‌మెంట్‌(గాలి సాంద్రత), ఫ్లడ్‌ మెజర్‌మెంట్‌(వర్షపాతం) వివరాలను నమో దు చేయించారు. చివరగా శాటిలైట్‌  ద్వారా మ్యాపింగ్‌ చేస్తామని సర్వే బృందం తెలిపింది. ఆప్టికల్‌ సర్వేద్వారా ప్రతిపాదిత స్థలానికి ఇరువైపులా 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న భౌగోళిక స్థితిని నమోదు చేస్తామన్నారు.  ప్రధానంగా గుట్టలు, హైటెన్షన్‌ టవర్లు, ఇతర వివరాలను సేకరిస్తామని చెప్పారు. 15 రోజుల పాటు పాలకుర్తి, పెద్దపల్లి, అంతర్గాం మండలాల పరిధిలో సర్వే కొనసాగుతుందన్నారు. కాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విమానాశ్రయం ఏర్పాటుపై తరచూ ఏవియేషన్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సర్వే పూర్తి కాగానే విమానాశ్రయం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యే                        అవకాశాలున్నాయి. logo