శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 22, 2020 , 01:36:58

పరిహారం పెంపు ఘనత టీఆర్‌ఎస్‌దే

పరిహారం పెంపు ఘనత టీఆర్‌ఎస్‌దే

జగిత్యాల: విద్యుత్‌ ప్రమాదాల్లో మృతి చెంది తే బాధిత కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన ఘన త టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన సాత్విక్‌, జగిత్యాల మండలం సోమన్‌పల్లికి చెందిన వెంకటవ్వ, వెల్దుర్తికి చెందిన దుర్గయ్య ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మృతి చెందగా, వారి కుటుంబాలకు ఎన్‌పీడీసీఎల్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. గతంలో ఉన్న ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం పెంచిందన్నారు. రైతులు విద్యుత్‌ స్తంభానికి ఒక గజం దూరం స్థలాన్ని వదిలి దున్నుకోవాలన్నారు. ఎక్కడైనా లూజ్‌వైర్లుంటే తప్పనిసరిగా విద్యుత్‌ అధికారులతో మరమ్మతు చేసుకోవాలన్నారు. వానకాలం కావడంతో విద్యుత్‌ స్తంభాలు, లూజ్‌వైర్లను రైతులు ముట్టవద్దని సూచించారు. రాయికల్‌ మండలంలో వర్షాలకు విద్యుత్‌ వైర్లు తెగి, 15 బర్రెలు మృత్యువాత పడితే వాటికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియాను కూడా చెల్లించామన్నారు. కార్యక్రమంలోఎంపీపీ గంగారాంగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సందీప్‌ రావు, సర్పంచులు బుర్ర ప్రవీణ్‌, సింగం అరుణ, కౌన్సిలర్లు అల్లె గంగాసాగర్‌, బొడ్ల జగదీశ్‌, పార్టీ అర్బన్‌ మండలాధ్యక్షుడు సురేందర్‌ రావు, జగిత్యాల పట్టణ, మండల కార్యదర్శులు వొల్లెం మల్లేశం, ఆనందరావు, నాయకులు బోగ ప్రవీణ్‌, రాజేశ్వర్‌రెడ్డి, శేఖర్‌, రాజ్‌గోపాల్‌ రావు, విద్యుత్‌ శాఖ ఏడీఈ జవహర్‌నాయక్‌, ఏఈలు సుందర్‌, రహీం, అశోక్‌ పాల్గొన్నారు. 

మట్టి విగ్రహాల పంపిణీ

జగిత్యాల రూరల్‌: కాలుష్య నివారణ మండ లి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌ లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత ప్రారంభించారు. కరోనా సమయంలో వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఇండ్లల్లోనే జరుపుకోవాలని సూ చించారు. అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. 

చేయూతనివ్వడం అభినందనీయం

అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ఉపాధ్యాయుడికి వైద్యం కోసం ఎస్‌టీయూ అందించిన చేయూత గొప్పదని ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాలకు చెందిన ఉపాధ్యాయుడు బంగ్లా శ్రీనివాస్‌ ఇటీవల అనారోగ్యం బారిన పడగా, అతడి వైద్యం కోసం ఎస్టీయూ ఆధ్వర్యంలో రూ.76వేలు స మకూర్చారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుమారుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ వైద్యానికి ప్రభుత్వపరంగా కూడా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో మత్తుల భూమయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం శ్రీనివాస్‌గౌడ్‌, తుంగూరి సురేశ్‌, నాయకులు బైరం హరికిరణ్‌, మచ్చ శంకర్‌, మేకల ప్రవీణ్‌, దశరథరెడ్డి, శమియొద్దీన్‌, రాజన్న తదితరులు పాల్గొన్నారు. 


logo