ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 21, 2020 , 02:14:13

సద్వినియోగం చేసుకోవాలి

సద్వినియోగం చేసుకోవాలి

గన్నేరువరం: గునుకులకొండాపూర్‌లో ఏర్పాటు చేయనున్న పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి సూచించారు. గురువారం ఆ గ్రామంలోని ఐకేపీ గోదాంలో మహిళా సంఘాలకు  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. నాబార్డు, ఎన్జీవోల ఆధ్వర్యంలో  పచ్చళ్ల తయారీ కేంద్రాని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జ్యోతి, ఏపీఎం లావణ్య, నాబార్డు ఏజీఎం, అనంతబాబు, డీఆర్‌డీఏ రాజేశం, నాయకులు బేతెల్లి రాజేందర్‌, బాల్‌రాజు, హన్మాండ్ల నర్సయ్య, హన్మాండ్ల యాదగిరి, న్యాలపట్ల శంకర్‌, న్యాలపట్ల లక్ష్మణ్‌, నాగపూరి శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీటీసీ పుట్టినరోజు సందర్భంగా సర్పంచ్‌ లింగంపెల్లి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రవీందర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. అలాగే గ్రామంలోని నెహ్రూ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు న్యాలపట్ల శంకర్‌ ఆధ్వర్యంలో ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ పలువురు కార్యకర్తలున్నారు.


logo