బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 21, 2020 , 02:14:19

ఎగువ మానేరును సందర్శించిన కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

ఎగువ మానేరును సందర్శించిన కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

గంభీరావుపేట: మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును గురువారం రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ సందర్శించారు. మానేరు పూర్తి సామర్థ్యం 31 అడుగులకు గాను ప్రస్తుతం 30 అడుగులకు చేరుకున్నది. ప్రాజెక్టుకు వచ్చే సందర్శకులు నీటి ప్రవాహంలో దిగకుండా తగుచర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ సిబ్బందికి సూచించారు. తహసీల్దార్‌ సుమ, ఇర్రిగేషన్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. 

కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

కలెక్టరేట్‌:    రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ అంజయ్య, ఆర్‌అండ్‌బీ అధికారులు, గుత్తేదారులతో కలిసి కలెక్టరేట్‌  ప్రగతిని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ అంజన్న, ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. 


logo