మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 21, 2020 , 02:14:19

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

హుజూరాబాద్‌ టౌన్‌: వీధి వ్యాపారుల కోసం కేంద్రప్రభుత్వం ఆత్మ  నిర్భర్‌ భారత్‌ కింద రుణాలు అందజేస్తున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి సూచించారు. గురువారం హుజూరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గందె రాధిక అధ్యక్షతన బ్యాంకు అధికారులతో లోన్‌ మంజూరుపై అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో ఇప్పటివరకు 1,245 మంది    వీధి విక్రయదారులను గుర్తించామని తెలిపారు. ఇందులో 342 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, ఇప్పటి వరకు 218 మందికి రూ.10వేల చొప్పున రుణం అందజేశామని వెల్లడించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ నిర్మల, కమిషనర్‌ ఈ జోన, మెప్మా పీడీ రవీందర్‌, మెప్మా డీఎంసీ శ్రీవాణి, ఏడీఎంసీ మానస, సీఎల్‌ఆర్పీలు స్వరూప, రమాదేవి, మెప్మా ఆర్పీలు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.


logo