ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 20, 2020 , 03:33:58

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

  • lఅత్యవసర సమయంలో    ముందస్తుగా ఆర్థిక సాయం
  • lచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

చొప్పదండి/ రామడుగు: తెలంగాణలోని నిరుపేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. రామడుగు, చొప్పదండి మండలాలకు చెందిన 14 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 2 లక్షల 77 వేల రూపాయలు మంజూరు కాగా, ఈ మేరకు చెక్కులను బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి వెల్లదీసుకున్న అభాగ్యులకు అండగా నిలుస్తున్నదని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా తక్కువ మందికి మాత్రమే సాయం అందిందన్నారు. అదికూడా కేవలం అప్పటి పాలకుల అనుచరులకు మాత్రమే లబ్ధి కలిగిందన్నారు. నేడు వివక్షకు తావు లేకుండా సీఎంఆర్‌ఎఫ్‌తో ప్రజలను ఆదుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అత్యవసర సమయాల్లో ముందస్తు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, సింగిల్‌ విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, రామడుగు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ రజబ్‌అలీ, ఏఎంసీ డైరెక్టర్‌ పైండ్ల శ్రీనివాస్‌, సర్పంచులు గుంట రవి, పులిపాక సురేశ్‌, పెద్ది శంకర్‌, లావణ్య, కో ఆప్షన్‌ పాషా, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, రాపెల్లి ఐలయ్య, శేషాద్రి, ఎడవెల్లి పాపిరెడ్డి తదితరులు ఉన్నారు.


logo