సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 19, 2020 , 02:43:28

వరదలతో అప్రమత్తంగా ఉండాలి

వరదలతో అప్రమత్తంగా ఉండాలి

సైదాపూర్‌: భారీ వర్షాలతో పలు గ్రామాలకు వరదల తాకిడి ఎక్కువగా ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వాటిలో ఉన్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మండలంలో ఎలాంటినష్టం జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం హరితహారంలో నిర్దేశించిన లక్ష్యం ఈ నెల 31లోపు వంద శాతం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటు, రైతు కల్లాల నిర్మాణాన్ని సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సురేందర్‌, ఏపీవో శోభారాణి, తదితరులున్నారు.


logo