ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 17, 2020 , 01:55:06

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ మానవత్వం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ మానవత్వం

జగిత్యాల రూరల్‌: కాలువిరిగిన కరోనా బాధితుడికి వైద్య బృందం సహాయంతో ఇంటివద్దే చికిత్స చేయించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మానవత్వాన్ని చాటారు. ఆయనను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన శంకర్‌గౌడ్‌ ఇటీవల ఇంట్లో జారిపడగా కాలు విరిగింది. దవాఖానలో చికిత్స చేయించుకునే క్రమంలో కరోనా బారిన పడ్డాడు. దీంతో వైద్యులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. ఓ వైపు భరించలేని నొప్పి, మరోవైపు కరోనా భయంతో తల్లడిల్లాడు. శంకర్‌ దీనస్థితిని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా నేత్ర వైద్యుడైన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. ఆర్థోపెడిక్‌ వైద్యులతో కలిసి బాధితుడి ఇంటికివెళ్లి చికిత్స చేయించి బాధనుంచి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ఎమ్మెల్యే సంజయ్‌, వైద్యుల బృందాన్ని అభినందించారు.  logo