మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 16, 2020 , 01:54:07

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: అధిక వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. శనివారం ఎస్సారెస్పీ ఇంజినీర్లు, పంచాయతీరాజ్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు  హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కాలువలు  నిండి ప్రవహిస్తున్నాయన్నారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సూచించారు. చెరువులు మత్తళ్లు దుంకుతున్నందున చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని, రోడ్డుపై వరద నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాలతో దాటవద్దని కోరారు. logo