శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 16, 2020 , 01:54:08

భారతమాతకు జేజేలు

భారతమాతకు జేజేలు

  • విద్యా సంస్థల్లో నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు  

కార్పొరేషన్‌: నగరంలోని పారమిత, ఐరిస్‌, ఎక్స్‌ప్లోరిక విద్యా సంస్థల్లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. పారమిత హైస్కూల్‌లో విద్యాసంస్థల చైర్మన్‌ ఇ ప్రసాద్‌రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రిటైర్డ్‌ సుబేదార్‌ మేజర్‌ శ్రీకాంత్‌  హాజరై మాట్లాడారు. పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు వినోద్‌రావు, అనూకర్‌రావు, ప్రసూన, రశ్మిత, రాకేశ్‌ ప్రసాద్‌, వీయూఎం ప్రసాద్‌, ప్రిన్సిపాళ్లు, వైస్‌ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి భారతమాత, దేశ నాయకుల చిత్రపటాలకు పూల మాలలు వేసి, జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.  ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమాన్‌నగర్‌లోని వసంత్‌వ్యాలీ పాఠశాలలో కరస్పాండెంట్‌ స్వరూపాబుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్లూ బెల్స్‌ పాఠశాలలో కరస్పాండెంట్‌ జంగ సునీతమనోహర్‌రెడ్డి జెండా ఎగురవేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో జాతీయ నాయకుల వేషధారణ, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

కొత్తపల్లి: కరీంనగర్‌లోని మానేరు విద్యా సంస్థల్లో స్వాతంత్య్ర వేడుకలు  నిర్వహించారు. విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక్కడ విద్యా సంస్థల డైరెక్టర్‌ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

జిల్లా న్యాయస్థానంలో..

కరీంనగర్‌ లీగల్‌: జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా నుంచి కోలుకున్న కోర్టు సిబ్బందికి పుష్పగుచ్ఛం అందజేసి, అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు కృష్ణమూర్తి, మాధవి కృష్ణ, ప్రేమా రాజేశ్వరి, శివజ్యోతి, సబ్‌ జడ్జి సతీశ్‌కుమార్‌, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయి, మెజిస్ట్రేట్‌లు సాయిసుధ, చందన, రాజు, ప్రదీప్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, కార్యదర్శి కొత్త ప్రకాశ్‌, పీపీ వేణుగోపాలరావు, పూరెళ్ల రాములు, ఏపీపీ గౌరు రాజిరెడ్డి, ఆవునూరి అశోక్‌కుమార్‌, పెంచాల ప్రభాకర్‌రావు, సిరికొండ శ్రీధర్‌, తేజ్‌దీప్‌రెడ్డి, జగదీశ్వరాచారి, కోర్టు పరిపాలన అధికారి ముత్యంనాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్‌ క్రైం: కమిషనరేట్‌ కేంద్రంలో సీపీ కమలాసన్‌రెడ్డి, పరిపాలన కార్యాలయంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, పీటీసీలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ చంద్రమోహన్‌ జాతీయ జెండా ఎగురవేశారు.  పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌, ఏసీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో అడిషనల్‌ డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీలు సోమనాథం, మదన్‌లాల్‌, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానీమియా, చంద్రశేఖర్‌, మురళి, మినిస్టీరియల్‌ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పీటీసీలో అత్యుత్తమ సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను ఏఆర్‌ ఎస్‌ఐ రామస్వామి, ఎం హరినాథ్‌, శ్రీధర్‌రెడ్డికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ చంద్రమోహన్‌ అందజేశారు. పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ రవి, డీఎస్పీలు చంద్రయ్య, శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్‌ హనోక్‌ పాల్గొన్నారు. 


logo