శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 13, 2020 , 01:54:25

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌..

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌..

  • అన్ని రంగాల్లోనూ అందెవేసిన చేయి lప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు..
  • lనేడు లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే..

జగిత్యాల క్రైం/జగిత్యాల రూరల్‌: ‘పుర్రచేయితో కొట్టానంటే.. పునర్జన్మలేకుండా పోతావ్‌'.. ఇదో తెలుగు సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌.. నిజ జీవితంలో సైతం ఎడమచేయి వాటం గలవారు ఎంతో ప్రత్యేకతను కలిగిఉంటారు. కుడిచేయి వాటం గల వారితో పోలిస్తే భిన్నంగా కనిపిస్తారు. అలవాట్లలోనూ, ఆహార్యంలోనూ తమదైన శైలిని కనబరుస్తున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాస్తవానికి మన సమాజంలో ఎడమ చేయితో పనులు చేసేవారిని కొంత తక్కువగా చూసేవారు. తల్లిదండ్రులు సైతం అన్ని క్రియలను కుడి చేతితోనే చేయాలని సూచించేవారు. అలాగే అలవాటు చేయించేవారు. కానీ సహజంగా అబ్బిన అలవాటు కావడంతో ఎంత ఒత్తిడి తెచ్చినా వారి ప్రత్యేకతలను కొనసాగిస్తున్నారు. ఎడమచేతి వాటం వారు ఎదుర్కొంటున్న  వివక్షపై బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు ఎడమ చేతివాటం కలిగిన కొందరూ   ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ ఇంటర్నేషల్‌ సంస్థను  1976 ఆగస్టు 13న స్థాపించారు. నాటి నుంచి ఈ రోజును లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డేగా నిర్వహిస్తున్నారు. 

ప్రపంచవావ్యాప్తంగా 15 శాతం మంది ..

కుడితేవాటం వారికి భిన్నంగా ఎడమచేత్తో పనులు చేసే వారి సంఖ్య 10 నుంచి 15 శాతం వరకు ఉంటుందని పరిశోధకులు తెలుపుతున్నారు. దేశాధ్యక్షులు, ప్రధానులు, ప్రముఖులు, ముఖ్యమైన పదవులు అలంకరించిన వారిలో 50 శాతం మంది ఎడమచేతి వాటం వారేని అధ్యయనాల్లో తేలింది. 85 శాతం కుడిచేయి వాటం వారితో పోలిస్తే ప్రతిభ, సృజనాత్మక రంగాల్లో రాణించే శక్తిసామర్థ్యాలు ఎడమచేతి వాటంవారిలోనే అధికంగా ఉంటుందని నాడీ శాస్త్రం కూడా స్పష్టం చేస్తుంది. దేశాధ్యక్షులు, వ్యాపార సంస్థల అధినేతలు, రచయితలు, సీనీ నటులు, క్రీడాకారులు ఇలా రంగం ఏదైనా ఎడమచేయి వాటం వారు ఆయా రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 

ఎడమచేయి వాటం గల ప్రముఖులు..

మహాత్మాగాంధీ, భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా, వ్యాపారవేత్తలు రతన్‌టాటా, లక్ష్మీమిట్టల్‌, బిల్‌ గేట్స్‌, క్రీడారంగంలో రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌, సినీ నటులు సూర్యకాంతం, సావిత్రి, అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌.

తాజావార్తలు


logo