శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 11, 2020 , 01:12:21

శివలింగంపై నాగుపాము

శివలింగంపై నాగుపాము

మల్లాపూర్‌: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కుస్తాపూర్‌ గ్రామ శివాలయం గర్భగుడిలో ఉన్న లింగంపై ఓ నాగుపాము పడగ విప్పి దర్శనిమిచ్చింది. గ్రామంలో పాములు పట్టే వ్యక్తి అటుగా వెళ్తున్న క్రమంలో అక్కడున్న ఆలయ పురోహితులు దర్శనానికి అతడిని పిలిచారు. ఈ క్రమంలో అతను తన దగ్గర ఉన్న పాముల పెట్టెను తీయగా అందులో ఉన్న నాగుపాము నేరుగా గర్భగుడిలోకి వెళ్లి శివలింగంపై కొద్ది సేపు ఆగి పడగవిప్పింది. శ్రావణమాస సోమవారం సందర్భంగా ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు ఆసక్తిగా తిలకించి ప్రత్యేక పూజలను చేశారు.logo