శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 11, 2020 , 01:07:21

ఇంటర్‌నెట్‌ను విజ్ఞానం కోసమే వినియోగించాలి

ఇంటర్‌నెట్‌ను విజ్ఞానం కోసమే వినియోగించాలి

జగిత్యాల క్రైం: ఇంటర్‌నెట్‌ను విజ్ఞానం కోసమే వినియోగించుకోవాలని, సైబర్‌ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి ఎస్పీ కమలాసన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరిట విద్యార్థులు, యువతకు గాలం వేసి డబ్బు లు దోచుకుంటున్నారని తెలిపారు. ఆటల మధ్య వచ్చే పరికరాలు కొనుగోలు చేయాలని యాప్స్‌ నిర్వాహకులు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ వ్యాలెట్‌ వివరాలను తెలుసుకొని నిండా ముంచుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఐడీ వివరాలు ఇస్తే ఖాతా ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు, బహుమతుల పేరిట ప్రజలకు గాలం వేస్తూ లింకులు పంపుతున్నారని, వీటిని ఓపెన్‌ చేయవద్దని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలుపాలని, జిల్లా కేంద్రంలో సైబర్‌ ఫోరెన్సిక్‌ నేరాల ల్యాబ్‌ ఉన్నదని ఆయన వివరించారు.


logo