సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 11, 2020 , 01:02:41

ఎడతెరిపి లేని వాన

ఎడతెరిపి లేని వాన

మెట్‌పల్లి/ధర్మపురి/కోరుట్ల రూరల్‌/కొడిమ్యాల/ కథలాపూర్‌/పెగడపల్లి/జగిత్యాల రూరల్‌: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురుతో కూడిన వాన కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి తుంపర్ల వాన పడుతున్నది. మెట్‌పల్లి డివిజన్‌ పరిధిలో ఒకింత అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. మరో వైపు మక్క, సోయా, వరి పంటలకు ఊపిరి పోసినైట్లెంది. ముసురు వానతో భూమిలోకి నీరు ఇంకి భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడుతుంది. ఇప్పుడిప్పుడే బోరుబావుల్లో భూగర్భజలాలు పెరగడంతో ప్రధానంగా వరి సాగు చేస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్‌, బుగ్గా రం, గొల్లపెల్లి మండలాల్లో సోమవారం మోస్తరు వర్షం పడింది. రోడ్లు బురదమయమయ్యాయి. పెగడపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం కల్లూరు గ్రామశివారులోని పాలచెరువు నిండుకుండలా మారి మత్తడి దూకుతున్నది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి సమృద్ధిగా నీరు చెరువులోకి వచ్చి నిండికుండలా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొడిమ్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం రాత్రి నుంచి ముసురు పడుతున్నది. ఆయా గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి నాచుపల్లి వెళ్లేదారిలో పెద్దవాగు  పొంగి ప్రహిస్తున్నది. కొండగ ట్టు, జగిత్యాల వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు చోట్ల పత్తి పంట నీట మునిగింది. కథలాపూర్‌ మండంలోనూ ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో ఆయా గ్రామాల్లో రోడ్లపై నీళ్లు చేరాయి. పో తారం శివారులో లొంక రామేశ్వరస్వామి ఆల యం వద్ద ఉన్న గుట్టల్లో వరద పారడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా పెగడపల్లి మండలం బతికపల్లి-పెగడపల్లి రోడ్డు పనులకు ఆటంకం కలుగుతున్నది. వర్షాలతో పత్తి, మక్క, కంది తదితర ఆరుతడి పంటలు సాగు చేసి న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారె స్పీ నీటి విడుదలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నుం చి నీరు వస్తుండడం, భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు పెద్ద మొత్తంలో వచ్చి చేరుతుండడంతో వానకాలం పంటకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల అర్బన్‌ మండలంలోని మోతె గ్రామంలోని మోతె చెరువు నిండు కుండలా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎస్సారెస్పీ నీరు చేరడంతో చెరువు నిండి మత్తడి దుంకుతున్నది.logo