మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 08, 2020 , 01:00:01

సీఎం సహాయ నిధి పేదలకు వరం

సీఎం సహాయ నిధి పేదలకు వరం

జగిత్యాల రూరల్‌: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో వివిధ శస్త్ర చికిత్సలు చేయించుకొని సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న జగిత్యాల పట్టణానికి చెందిన 19మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5,27,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ కారణాలతో శస్త్ర చికిత్స చేయించుకునే పేదలు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే సాయం అందుతుందన్నారు. కరోనా నేపథ్యం లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూ రం పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని, అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ కూతురు రాజేశ్‌, రూరల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, నాయకులు కూతురు శేఖర్‌, కత్తురోజు గిరి, ఆనందరావు పాల్గొన్నారు.   

విద్యాసంస్థలను ఆలయాలుగా భావించాలి

జగిత్యాల: విద్యా సంస్థలను ఆలయాలుగా భావించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాల వద్ద జాతీయ రహదారి వెంట హరితహారంలో భాగంగా శుక్రవారం ఆయన మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే విధానంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సెట్‌బ్యాక్‌ లేకుండా మొక్కలు నాటితే రానున్న రోజుల్లో ప్రమాదాలకు నిలయంగా మారే అవకాశముందని అధికారులపై అసంతృప్తి వ్యక్తంజేశారు. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులకు నిలయమైన ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో నేడు వందల్లో విద్యార్థులున్నారని, కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ సుమారు 80 లారీలకు పైగా చెత్త రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కళాశాల చుట్టూ ఉన్న ప్రదేశాన్ని డంప్‌యార్డుగా మార్చారని అసహనం వ్యక్తంజేశారు. విద్యార్థులు, సిబ్బంది, ఎన్‌సీసీ కెడెట్ల సహకారంతో కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, కూసరి అనిల్‌, నాయకులు దావ సురేశ్‌, గట్టు సతీశ్‌, ప్రిన్సిపాల్‌ రాము, సిబ్బంది పాల్గొన్నారు. 

ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

జగిత్యాల: రూ.86లక్షల 14వ ఆర్థిక సం ఘం నిధులతో మున్సిపాలిటీకి కొనుగోలు చేసిన ఎక్స్‌కవేటర్‌, ఆరు ట్రాక్టర్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ గుగులోతు రవి, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, కమిషనర్‌ అరుణశ్రీతో కలిసి శుక్రవారం టౌన్‌హాల్‌లో ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో అతి పురాతన మున్సిపాలిటీ జగిత్యాల అని, అభివృద్ధిలో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ.. జిల్లాలో అతిపెద్ద ము న్సిపాలిటీగా జగిత్యాలను అన్ని రంగాల్లో ముందుంచడానికి సిబ్బంది అహర్నిషలు పని చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శ్రావణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే పట్టణాన్ని శానిటైజ్‌ చేశామన్నారు. అనంతరం టౌన్‌హాల్‌లో మొక్కలు నాటారు. వైస్‌ చైర్మ న్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo