మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 05, 2020 , 01:58:31

స్వీయ రక్షణతోనే కరోనా నియంత్రణ

స్వీయ రక్షణతోనే కరోనా నియంత్రణ

  • lకోరుట్ల ఎమ్మెల్యే తనయుడు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 
  • l‘కొవిడ్‌-19’ రెస్పాన్స్‌ వాహనం ప్రారంభం

కోరుట్ల: స్వీయ రక్షణతోనే కరోనా నియంత్రణ సాధ్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు టీఆర్‌ఎస్‌ యువనేత డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన కొవిడ్‌-19 రెస్పాన్స్‌ వాహనాన్ని మంగళవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. అనంతరం కోరుట్ల, మెట్‌పల్లి వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు తన మిత్రుల సహకారంతో అంబులెన్స్‌ను సమకూర్చానని చెప్పారు. కరోనా బాధితులు, అనుమానితులకు ఈ వాహనం ఎం తగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేస్తానని, వైరస్‌ పీడితులు, వైద్య సిబ్బందికి అవసరమైన మందులు, పీపీఈ కిట్లు అందిస్తానని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారి భోజన ఖర్చులు భరిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు అన్నం లావణ్య, రణవేణి సుజాత, ఉపాధ్యక్షులు గడ్డమీది పవన్‌, చంద్రశేఖర్‌, కమిషనర్‌ అయాజ్‌, కోరు ట్ల దవాఖాన సూపరింటెండెంట్‌ నవీన్‌కుమార్‌, ఆర్బీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి  మనోహర్‌ ఉన్నారు. 


logo