ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 05, 2020 , 01:58:40

‘కరోనా’లోనూ సంక్షేమానికి పెద్దపీట

‘కరోనా’లోనూ సంక్షేమానికి పెద్దపీట

  • lమంత్రి కొప్పుల ఈశ్వర్‌ lధర్మారం మండలంలో పర్యటన
  • lనంది రిజర్వాయర్‌ వద్ద సీఎం కేసీఆర్‌  పల్లెప్రకృతి వనానికి శంకుస్థాపన 
  • l30 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

ధర్మారం: కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర సరారు సంక్షేమాని పెద్దపీట వేసిందని, అన్నదాతల ఆర్థికాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్‌ సాగు నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ధర్మారం మండలం నంది మేడారం, కానంపల్లి గ్రామాల్లో మంగళవారం జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి మంత్రి ఈశ్వర్‌ పర్యటించారు. నంది మేడారం శ్రీ అమరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నంది రిజర్వాయర్‌ కట్ట దిగువ న 10 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి విశాలంగా ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌ పల్లె ప్రకృతి వనానికి మంత్రి ఈశ్వర్‌ శంకుస్థాపన చేసి ఆకర్షణీయమైన మొక్కలు నాటారు. వనం వద్ద కాకతీయుల స్వాగత తోరణ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నంది రిజర్వాయర్‌ కట్టపై జీపీ పాలకవర్గం ఏర్పాటు చేసిన ‘జై కేసీఆర్‌' శిలా నామకరణాన్ని మంత్రి, ‘జై ఈశ్వరన్న’ శిలా నామకరణాన్ని జడ్పీ చైర్మన్‌ ఆవిష్కరించారు. అనంతరం కానంపల్లిలో పర్యటించి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటి ‘అంబేద్కర్‌ స్మృతి వనంగా నామకరణం చేశారు. జీపీ భవనానికి శంకుస్థాపన చేసి, సీసీ రోడ్డును ప్రారంభించి, పంచాయతీ కార్యాలయం వద్ద  30 మంది లబ్ధిదారులకు భూ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. ప్రాజెక్ట్‌ల నీటిని ప్రతి ఎకరాకు అందించేలా త్వరలో లష్కర్ల నియామకం చేపడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని వెల్లడించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రస్తుతం గ్రామాల రూపు రేఖలు మారనున్నాయన్నారు. నంది మేడారంలో బైపాస్‌ రోడ్డు నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు రూ.కోటి నిధులతో డబుల్‌ రోడ్డు నిర్మిస్తామని, అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు కేటాయిస్తామని, కాకతీయుల కాలం నాటి శ్రీ అమరేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని, నంది రిజర్వాయర్‌ లోపల జాలీ ఏర్పాటు చేయడంతోపాటు, సీఎం కేసీఆర్‌ పల్లె ప్రకృతి వనాన్ని రాష్ట్రంలోనే అందమైన పార్క్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దుతున్న ఎంపీడీవో జయశీలను మంత్రి అభినందించారు. కానంపల్లిలో దళితులకు మూడెకరాల చొప్పున భూమి కేటాయించగా సమస్యలు పరిష్కరించి రెవెన్యూ శాఖ ద్వారా 30 మందికి పట్టాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. భీమన్న చెరువు అభివృద్ధి, తుంగ బంధం మాటు నిర్మాణం, కానంపల్లి నుంచి పైడి చింతలపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదన్నారు. మంత్రికి ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీవో జయశీల కలిసి నంది మేడారంలో చేపట్టనున్న పల్లె ప్రకృతి నమూనాను బహూకరించగా, జీపీ పాలకవర్గం జ్ఞాపికను అందజేసి మంత్రి, జడ్పీ చైర్మన్‌ను గజమాలతో సత్కరించారు. ధర్మారం ఎంపీపీ కార్యాలయం వద్ద ప్రైవేటు లెక్చరర్లకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, వైస్‌ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచులు సామంతుల జానకి శంకర్‌, గుర్రం మనీషా, పూస్కూరు జితేందర్‌రావు, ఎంపీటీసీలు కట్ట సరోజ, మిట్ట తిరుపతి, ఉప సర్పంచ్‌ కట్ట రమేశ్‌, ప్యాక్స్‌ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సామంతుల రాజమల్లు, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గూడూరి లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెంచా ల రాజేశం, జిల్లా, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ సలామొద్దీన్‌, ఎండీ రఫి, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ పా కాల రాజయ్య, జిల్లా సభ్యు డు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జడ్పీ సీఈఓ మచ్చ గీత, డీపీవో సుదర్శన్‌, డీఆర్డీవో వినోద్‌, డీసీపీ రవీందర్‌, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్‌ సంపత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  


logo