మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 04, 2020 , 02:33:01

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

  •  n  ఆక్సిజన్‌తో కూడిన అంబులెన్సులు  సిద్ధంగా ఉంచాలి
  • n  కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌ హెల్త్‌ : కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ శశాంక వైద్యాధికారులను  ఆదేశించారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో గల  ఐసొలేషన్‌ సెంటర్‌ (కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌)ను సోమవారం  ఆయన సందర్శించారు. ఐసొలేషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వసతులు, బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. బాధితులకు అవసరమైన వసతులు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్యం అవసరమున్న వారిని జిల్లా ప్రధాన దవాఖానకు తరలించేందుకు వీలుగా ఆక్సిజన్‌తో కూడిన అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఐసొలేషన్‌ సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్లాలనుకునే వారికి తగు సూచనలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.  ఆయన వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, టీబీ అధికారి డాక్టర్‌ కేవీ రవీందర్‌రెడ్డి, తదితరులున్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్‌ వార్డులను సందర్శించారు. దవాఖానలో బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, వైద్యులు శౌరయ్య, అలీం, వైద్యులు పాల్గొన్నారు. 


logo