బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 03, 2020 , 01:23:57

ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

జగిత్యాల టౌన్‌: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ భవనంలో బీర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జువ్వాడి రాజేశ్వరరావు ఉద్యోగ విరమణ, సన్మాన కార్యక్రమం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాజేశ్వర్‌రావు ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల ఉద్యో గ విరమణ వయసును ప్రభుత్వం త్వరలోనే పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటులో తప్పకుం డా చొరవ చూపిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.  రాజేశ్వర్‌రావును ఎమ్మెల్యే జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్‌రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వొడ్నాల రాజశేఖర్‌, బోనగిరి దేవయ్య, రాష్ట్ర సేవా కన్వీనర్‌ గడ్డం మహిపాల్‌రెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్‌ మెన్నేని నీలిమ, ఆ సంఘం మండల మహిళా బాధ్యులు రమాదేవి, నాగరాణి, జిల్లా బాధ్యులు ప్రసాద్‌రావు, పూర్ణచందర్‌, వేణుగోపాల్‌, జయసింహారావు, రాజేందర్‌రావు, శ్రీనివాస్‌మూర్తి, శ్రీనివాస్‌రావు, మలహలరావు, రాజేశ్‌, శరత్‌రావు, లీలన్‌కుమార్‌, మహేశ్‌, అశోక్‌రావు, బోగ మల్లేశం, సారంగాపూర్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌, నాగరాజు, జగిత్యాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్‌, సురేందర్‌, గంప రాములు, లక్ష్మణ్‌రావు, పలువురు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే పరామర్శ 

జగిత్యాల పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు అనుమల్ల సూర్యప్రకాశ్‌ భార్య రమాదేవి గుండెపోటుతో ఆదివారం మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు గుగ్గిల్ల హరీశ్‌, శివకేసరి బాబు, గంగసాగర్‌, నాయకులు బోగ ప్రవీణ్‌, కూసరి రాంచంద్రం, తదితరులు ఉన్నారు. 


logo