బుధవారం 05 ఆగస్టు 2020
Jagityal - Aug 01, 2020 , 02:40:50

రంది లేని ఎవుసం

రంది లేని ఎవుసం

నమస్తే తెలంగాణ / అగ్రికల్చర్‌: ఉమ్మ డి జిల్లాలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. వానకాలానికి ముందే సర్కారు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా చెరువులు, కుంటలను నింపడంతో ఇప్పుడు మత్తళ్లు దుంకుతున్నాయి. దీంతో భూగర్భ జలా లు పెరిగి బావులు, బోర్లలో ఊట పెరిగింది. ఇటు కాళేశ్వర జలాలతో వరద కాలువనూ నింపడంతో కిలోమీటర్ల పొడవునా రిజర్వాయర్‌ గా మారింది. తూములతో అందుబాటులో ఉన్న చెరువులకు నీళ్లివ్వడంతో ఆయకట్టు లేని ప్రాంతాల్లోనూ భూ గర్భ జలాలు ఉబికి వచ్చాయి. దీంతో బావుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. జూలై వరకు తూముల ద్వారా చెరువులను నింపారు. ఫలితంగా ఆకాశానికేసి చూడకండా నార్లు పోసుకున్న రైతులు గతం కంటే ముందే వరినాట్లు వేస్తున్నారు.

నిరంతరం కరెంట్‌..

నాటి పాలనలో కరెంట్‌ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. రాత్రిళ్లు మోట ర్ల వద్దే గడపాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా కరెంట్‌ సమస్యకు పరిష్కారం చూపింది. వ్యవసాయ రం గానికి 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ఫలితంగా రైతాంగానికి రంది లేకుండా పోయింది. రైతులు ఎప్పుడంటే అప్పు డు పొలానికి నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 2,13,378 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. పెరిగిన భూగర్భ జలాలతో బావులపై సేద్యం ఈ సారి మరింత గొప్పగా జరిగే అవకాశాలున్నాయి. 

 రైతుబంధు భరోసా..

నాడు సీజన్‌ వచ్చిందంటే పెట్టుబడుల కోసం తండ్లాడేది. అప్పుల కోసం సేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేది. ఇంట్ల ఏమైనా బంగారు గొలుసులుంటే కుదవ పెట్టేది. తిరిగి పంట చేతికి వచ్చిన అమ్మి కట్టేది. స్వరాష్ట్రంలో ఈ తిప్పలన్నీ తప్పా యి. సీజన్‌కు ముందే సర్కారు రైతుబంధు కింద పెట్టుబడికి సాయం చేస్తున్నది. ఒక్కో సీజన్‌లో ఎకరాకు 5వేల చొప్పున అందజేస్తున్నది. ఉమ్మ డి జిల్లాలో ఈ సీజన్‌లో 5, 31,659 మంది రైతు లు రైతు బంధు ద్వారా లబ్ధిపొందారు. వీరికి ఈ సీజన్‌లో ఇప్పటికే రూ.821 కోట్లకు పైగా సాయం అందింది. ఇక ప్రతి రైతుకూ రైతు బీమాను ప్ర భుత్వం చెల్లించింది. ఎకరానికి ఒక ఫసల్‌కు రూ. 5 వేల చొప్పున పెట్టుబడి సా యం అందిస్తుండడంతో రైతులు సాగు పనుల్లో మునిగిపోయారు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు..

ఉమ్మడి జిల్లాలో సేద్యానికి అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వరి, పత్తి, కంది, సోయా, పసుపు పం టలను ప్రధానంగా సాగు చేసే అవకాశం ఉండడంతో వాటికి సంబంధించిన విత్తనాలను, ఎరువులను ముందుగానే సిద్ధం చేసింది. 2,77,156 మెట్రిక్‌ టన్నుల ఎరువులను, 1,42,855 క్వింటా ళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉం చింది.  

బిజీ బిజీగా రైతులు..

ప్రభుత్వం ప్రాథమిక అవసరాలను తీర్చడం తో రైతులు సంతోషంగా సాగుకు సిద్ధమయ్యారు. జలవనరులను, విద్యుత్‌ను ఇస్తుండడం, విత్తనా లు, ఎరువులను చేరువ చేయడం, పెట్టుబడి కూ డా ఇస్తుండడంతో ఆనందోత్సాహాలతో ముందు కు సాగుతున్నారు. ఈ సారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 17,61,058 ఎకరాల సాగు విస్తీర్ణం అం చనా కాగా, ఇందులో 3,13,050 ఎకరాల్లో వరి, 10,73,568 ఎకరాల్లో పత్తి వేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, వర్షాలు సకాలంలో కురవడంతో సేద్యపు పనుల్లో రైతులు బిజీగా మారారు.


logo