మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 01, 2020 , 02:37:47

కోటపల్లిలో కరోనా పరీక్షలు ప్రారంభం

కోటపల్లిలో కరోనా పరీక్షలు ప్రారంభం

కోటపల్లి /వేమనపల్లి: కోటపల్లి పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొత్తం నలుగురి నుంచి నమూనాలు సేకరించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వేమనపల్లి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు.  వేమనపల్లి పీహెచ్‌సీలో ముగ్గురికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఓ ఉపాధ్యా యుడికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.

చెన్నూర్‌: చెన్నూర్‌లో పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌  సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం 31 మందికి పరీక్షలు చేయగా, 10మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 

తాండూర్‌ : మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాసిపేటకు చెందిన ఇద్దరికి వారం క్రితం జ్వరం రావడంతో చికిత్స కోసం దవాఖానకు వెళ్లగా వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. తాండూర్‌ ఐబీ కేంద్రానికి చెందిన మరో వ్యక్తికి సింగరేణి ఆధ్వర్యంలో టెస్టులు చేయగా పాజిటివ్‌ వచ్చింది. కాసిపేటకు చెందిన ఇద్దరిని బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఐబీ కేంద్రానికి చెందిన సదరు వ్యక్తి ని హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. కరోనా సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులు 21 మందిని, కాలనీ వాసులను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

బెల్లంపల్లి టౌన్‌ : పట్టణంలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్టేషన్‌ రోడ్డు కాలనీలోని సింగరేణి కార్మికుడి కుటుంబంలో నలుగురికి, 2 ఇైంక్లెన్‌ రడగంబాల బస్తీలో ఓ కానిస్టేబుల్‌, ఆమె కూతురు, గోల్‌బంగ్లాబస్తీలో సింగరేణి కార్మికుడు, మహ్మద్‌ఖాసీం బస్తీలో ఓ ప్రైవేట్‌ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. అధికారులు ఈ నాలుగు ఏరియాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. వీరి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. 

మందమర్రి : పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 44 మందికి పరీక్షలు చేయగా, 18 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ శివప్రతాప్‌ తెలిపారు. బాధితులకు మందులు పంపిణీ చేసి, పాటించాల్సిన నియమా లను వివరించినట్లు ఆయన తెలిపారు..

కాసిపేట : కాసిపేట గనిలోని బీ రిలేలో విధు లు నిర్వహించే కార్మికుడికి పాజిటివ్‌ వచ్చింది. అనారోగ్యంతో ఇటీవల కరీంనగర్‌లోని దవాఖానకు వెళ్లాడు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


logo